బెల్ట్ షాపులపై మహిళల దాడి
నెల్లూరు : జిల్లాలోని పలు మద్యం దుకాణాలపై మహిళలు పెద్ద ఎత్తున దాడులు జరిపారు. బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. బెల్టు షాపులను తిరిగి తెరిస్తే సహించేది లేదని, తరిమి తరిమి కొడతామని వారు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కొండపూర్ మండలం మర్రిగుంటలో బెల్ట్ షాపులపై మహిళలు బుధవారం దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది.
News Posted: 15 July, 2009
|