14 నుంచి హస్తకళల పండుగ
రాజమండ్రి : హస్తకళాకారుల నైపుణ్యం పెంచి, వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఈనెల 14 నుంచి 23 వరకు 'భారతీయ హస్తకళల పండుగను' నిర్వహించనున్నట్లు కాకతీయ ఆర్టి జాన్స్ సంక్షేమ సంఘం ప్రతినిధి ఎ.శివరామకృష్ణ చెప్పారు. సర్వారాయ కళామందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలిపారు. కేంద్ర జౌళి శాఖ సహకారంతో సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించే ఈ ప్రదర్శనకు వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు తాము తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి అమ్మానికి ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. హస్తకళా ప్రదర్శనలో భాగంగా చెక్కబొమ్మలు, ముత్యాలు, ఆభరణాలు, గృహోపకరణాలు, చేనేత వస్త్రాలు తదితర హస్తకళా వస్తువులు ఉంటాయన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, కమిషనర్ మాణిక్ రాజ్ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో హస్తకళల సంస్థ అధ్యక్షులు ఎ.రహమాన్, కార్యదర్శి ఎం.డి.షరీఫ్ ఉద్దీన్, సమాచార శాఖ ఎ.డి.ఎం.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
News Posted: 13 August, 2009
|