కానిస్టేబుల్ అరెస్ట్
కాకినాడ : ఓ కానిస్టేబుల్ పేకాడుతూ బుధవారం పోలీసులకు దొరికిపోయాడు. కాకినాడ మున్సిపల్ గెస్ట్ హౌస్ పై పోలీసులు దాడి చేయగా అక్కడ పేకాడుతున్న ఓ కానిస్టేబుల్ తో సహా మరో ఎనిమిది మందిని వారు అరెస్ట్ చేశారు. వారి దగ్గర్నుంచి 22 వేల రూపాయల నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 19 August, 2009
|