హైదరాబాద్ తెలంగాణ అబ్బ సొత్తే
కరీంనగర్ : హైదరాబాద్ నగరం తెలంగాణ అబ్బ సొత్తే అని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రాంత నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడడం తెలంగాణేతరులకే నష్టం కలిగిస్తుందని ఆయన బుధవారం ఇక్కడ హెచ్చరించారు. వ్యాపారాభివృద్ధి కోసమే కొందరు సమైక్యాంధ్ర నినాదాన్ని వాడుకుంటున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో సినిమా షూటింగ్ లు జరుపుకుంటే ఎవరూ అడ్డుకోరని, తెలంగాణకు వ్యతిరేకంగా రాజకీయ నాయకుడిలా మాట్లాడిన ఎవరైనా దాడులు ఎదుర్కోక తప్పదన్నారు.
News Posted: 23 December, 2009
|