అనంతపురం : జిల్లాలోని తాడిమర్రిలో టిడిపి నాయకుడు రాముడిని ప్రత్యర్థులు హతమార్చారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. రాముడి హత్య సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.