రిమ్స్ డైరక్టర్ రాజీనామా
కడప : రిమ్స్ సంచాలకులు చంద్రశేఖర్ తన పదవికి రాజీనామా చేసారు. ఈ నెల 4న ఆయన రాజీనామా లేఖను డీఎంఈ కి పంపారు. రాజీనామా పత్రంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి మరో పత్రం కూడా పంపడం చర్చానీయాంశమైంది. రిమ్స్ లో వైద్యుల పనితీరు, విభాగధిపతుల వ్యవహారశైలి, సిబ్బంది నిర్లక్ష్యం వంటి అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
News Posted: 9 January, 2010
|