కరీంనగర్ : సమ్మక్క-సారక్కలకు ప్రత్యేకంగా ఆలయం నిర్మాణమవుతోంది. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని గోపాల్ చెరువులో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ మేరకు ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భక్తుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారక్క లకు శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మాణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే కమలాకర్ పేర్కొన్నారు.