వాలంటీర్ల నిరసన
వరంగల్ : మేడారంలోని సమ్మక్క- సారలమ్మ జాతరలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు శుక్రవారం విధులు బహిష్కరించారు. ఎస్సై సాంబశివరాజు ఓ వాలంటీర్ పై చేయి చేసుకోవడంతో వారు నిరసన తెలుపుతూ సమ్మక్క- సారలమ్మల గద్దె ఎదుట బైఠాయించారు. తమతో దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసులను విధుల నుండి తొలగించాలని వాలంటీర్లు డిమాండ్ చేసారు. కాగా, ఎస్సై పై చర్య తీసుకుంటామని జిల్లా ఎస్పీ హామీ ఇవ్వడంతో వాలంటీర్లు తిరిగి విధుల్లో చేరారు.
News Posted: 29 January, 2010
|