ఎర్రబెల్లి అరెస్ట్
వరంగల్ : ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తెలంగాణ జేఏసీ ముట్టడించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, తెరాస నేత విజయరామారావులు పాల్గోన్నారు. ప్రత్యేక తెలంగాణను తక్షణం ప్రకటించాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోకి చొరబడేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎర్రబెల్లి, విజయారామారావులను పోలీసులు అరెస్ట్ చేసారు.
News Posted: 1 February, 2010
|