కుటుంబం ఆత్మహత్య
వరంగల్ : జిల్లాలోని చిట్యాల మండలం చిల్లగరిగలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే వీరు ఆత్మహత్యకు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఈ ఘటనలో భార్య హారిక, భర్త జగన్నాథంతో సహా కుమారుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
News Posted: 3 February, 2010
|