వరంగల్ : తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య ఇంటిని ముట్టడించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వాళ్లు కాళ్లు మొక్కుతూ ఆందోళన కొనసాగించారు. ఇంతలో అక్కడకు చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడంతో వారిరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని దాడికి దారి తీసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు.