వరంగల్ : నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై విద్యార్థులు దాడి చేసారు. శనివారం సాయంత్రం కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. తెలంగాణకు మద్దతుగా ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని విద్యార్థులంతా డిమాండ్ చేసారు. రాజీనామాలు చేయకుంటే దాడులు విస్తృతం చేస్తామని హెచ్చరించారు.