కర్నూలు : కర్నూలు జిల్లా ఫ్యామిలీ కోర్టులో స్టెనోగా పనిచేస్తున్న స్టెనో రాదారాణిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సెషన్స్ జడ్జి షణ్ముఖంపై గురువారం ఉదయం స్టెనో చెప్పు విసిరిన విషయం తెలిసిందే. జడ్జి షణ్ముఖం తనపై నానా దుర్బిషలాడుతున్నాడని ఆందువల్లే తాను ఈ పని చేసినట్లు రాధారాణి పేర్కొంది.