Active Blogs | Popular Blogs | Recent Blogs కలగానే కలిసాను
కలలోనే వలచాను
కన్నీళ్ళే నిజమని నాకు ఇన్నాళ్ళకు తెలిసేను
దేవతవని తలచాను
నా మతమే మార్చాను
అమృతమే ఇస్తావని దోసిలినే పట్టాను
శాపాలే పొందాను
సతమతమై పోయాను
విషమే యద నింపుకుని కథ కంచికి చేర్చాను
కల్లెంతగా వెతికినా ,నీకోసం బ్రతికినా
ఎంతగ బతిమాలినా,నీ మనసు కరగదా ,నా మనసు ఎరగవా
నేనేమో నీవన్నా,నువ్వేమో కాదన్నా
నీకోసం వేచున్నా,నీ మనసు తెలుపదా,నా మనసున ఈ వ్యధ
కన్నీరే వస్తున్నా,మున్నీరై పోతున్నా
నీ కలలే కంటున్నా ,నీ మనసు మారదా ,నా మనసును చేరదా
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|