Active Blogs | Popular Blogs | Recent Blogs ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీ నామ స్మరణమే మాకెంతో హాయి
జయ సాయి మా సాయి శ్రీ దత్త సాయి
నీ పుణ్య ధామమే మాకు ద్వారకామాయి
కరుణించి కాపాడు దేవుడివే
మరణించీ పలుకుతున్న పరమాత్మవే
నీ దివ్య రూపము చూడగనే
మా పాపాలు మంటల్లో కరిగేనే
దండాలే పెడతాము పాదాలకి
అండగా నువ్వుండాలి లోకాలకి
పూలెన్నో తెచ్చాము నీ పూజకి
దయచూచి కష్టాలు కదతేర్చవా
ప్రతినిముషం మా నోట నీ నామమే
నీ మీద వేశాము మా భారమే
వెన్నంటి నువ్వుంది నడిపించగా
ప్రతిరోజూ మాకింక ఓ పండగ
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|