Active Blogs | Popular Blogs | Recent Blogs అడుగులు తడబడుతున్నాయి
మాటలు కరువవుతున్నాయి
గుండె నుంచి గొంతు దాకా నీ ఊసుల బరువే
బరువు దించుదామంటే పరువు పోతుంది
భరిద్దామంటే ఊపిరి పోతుంది
నిన్ను చేరువయ్యేదాకా కన్నీటి చెరువు కట్టలు తెగుతూనే ఉంటుంది
నా నరాలతో స్వరాలు మీటి
పెదాలతో పదాలు కూర్చి
వేదననే వేదిక చేసి నీకై గీతం
ఆలపించి ,ఆలసించి,నీరసించి పోయాను
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|