ఇప్పటి దాకా తమ సృజనాత్మకతను తామే కాపీ కొట్టుకోడం సంగీత దర్శకులకే చెల్లించదనుకుంటున్న తరుణంలో తాజాగా కృష్ణారెడ్డి బహుమతితో దర్శకులు కూడా ఆ కోవలో చేరినట్లయ్యింది. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి త్వరలో తీయనున్న చిత్రం పెళ్ళాం ఊరెళితే, బహుమతి ల కలిపికొట్టుడుగా ఉంటుందని ఊహించడంలో తప్పు లేదేమో... ఏదెలా ఉన్నా సగటు ప్రేక్షుకుడికి కావలసింది బోరు కొట్టని రెండున్నర గంటల సినీ వినోదం. దాంతో పాటు క్లీన్ సర్టిఫికేట్ పొందిన బహుమతి, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కృష్ణారెడ్డి హిట్ కొట్టాలన్న కసితో తెలుగు ప్రేక్షకులకు బహుమతి ఇచ్చాడు.
థూళిపాళ్ళ మహేష్