మరోసారి జగపతిబాబు గాయం
హీరోగా నటిస్తూనే ప్రత్యేక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న జగపతిబాబు మరోసారి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాయి. వారం తేడాతో ఆయన హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జగపతిబాబు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న 'సిద్ధం' చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధం కాగా, జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన 'బంగారుబాబు' చిత్రం ఈనెల 20న విడుదలవుతోంది. సముద్ర దర్శకత్వంలో 'అధినేత' చిత్రం నిర్మాణంలో ఉంది.జగపతిబాబు ప్రత్యేక పాత్రలో దిల్ రాజు నిర్మిస్తున్న 'ఆకాశమంత' చిత్రం ఉగాది కానుకగా విడుదల కానుంది. తాజాగా మరో రెండు కొత్త చిత్రాలకు కూడా జగపతిబాబు అనౌన్స్ చేశారు.
దశాబ్దం క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబుకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రం 'గాయం'. ఆ చిత్రం తర్వాతే జగపతిబాబు హీరోగా బిజీ అయ్యారు. ఇన్నేళ్లకు మళ్లీ జగపతిబాబు గాయం చిత్రానికి సీక్వెల్ లో నటించబోతున్నట్టు ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించున్నారు. 'గాయం-2' లో తొలి వెర్షన్ లో నటించిన రేవతి, ఊర్మిళ మమరోసారి నటించబోతుండటం విశేషం. మదన్ హీరోగా మరో చిత్రానికి కూడా జగపతిబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రచయితగా మంచి పేరుతెచ్చుకున్న మదన్ ఆమధ్య జగపతిబాబు హీరోగా 'పెళ్లయిన కొత్తలో' చిత్రంతో దర్శకుడయ్యారు. ఆ చిత్రం ఇటు జగపతిబాబుకు, అటు మదన్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ను తెచ్చింది. మదన్ టాలెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఆయనతో మరో కొత్త ప్రాజెక్ట్ కు జగపతిబాబు సంతకం చేశారు. వీటికితోడు జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో 'రక్ష-2' చిత్రానికి కూడా జగపతిబాబు సిద్ధంగా ఉన్నారు.
Be first to comment on this News / Article!
|