'ల్యాబ్స్'లో 600 సినిమాలు
కొత్తగా నిర్మాణంలోకి అడుగుపెడుతున్న వారికి పరిశ్రమ పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమవుతోందని నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ నిశితంగా విమర్శించారు. సదరు నిర్మాతలు తమ కొడుకులనో, బంధువులనో హీరోలుగా చేస్తున్నారనీ, ఇప్పుడు వారి దగ్గర డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడితే, బయట వారెవరూ ఆ సినిమాలను పూర్తి చేసే సాహసానికి పూనుకోవడం లేదన్నారు. 'ఒకవేళ ఎవరైనా సినిమా పూర్తి చేద్దామని ముందుకు వస్తే హీరోలు వయసు దాటిపోయి ఉంటారు. చైల్డ్ ఆర్టిస్టులు పెద్దవాళ్లు అయిపోతారు. కాస్ట్యూమ్స్ అవుటాఫ్ ఫ్యాషన్ అయిపోతాయి. దీంతో సినిమాలో ఎక్కువ భాగం రీషూట్ చేయాల్సి వస్తుంది. అలాంటి రిస్క్ తీసుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు' అని ఆయన పేర్కొన్నారు. కర్ణుడు చావుకు అనేక కారణాలున్నట్టు రోజురోజుకూ మూలనపడుతున్న చిత్రాల సంఖ్య పెరగడానికి కూడా సవాలక్ష కారణాలు తోడవుతున్నాయన్నమాట.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|