20న 'మొండి మెగుళ్లు..'
రఘుబాబు, శివాజీరాజా హీరోలుగా కుమారి యనమల హర్షిణిరెడ్డి సమర్పణలో మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై యనమల బాబిరెడ్డి నిర్మించిన కామెడీ ఎంటర్ టైనర్ 'మొండిమొగుళ్లు పెంకి పెళ్లాలు'. కె.వి.రమణ దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 20న విడుదలకు సిద్ధమవుతోంది.
టైటిల్ కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి వినోద భరిత చిత్రంగా దర్శకుడు రమణ తెరకెక్కించారనీ, అన్ని వర్గాలను అలరిచేందుకు ఈనెల 20న మా 'మొండి మెగుళ్లు పెంకి పెళ్లాలు' ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనీ నిర్మాత బాబిరెడ్డి తెలిపారు. ఈ చిత్రం ద్వారా సిద్దు సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారనే, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవల ఆడియో మంచి విజయం సాధించడంతో త్వరలోనే ప్లాటినం డిస్క్ జరుపనున్నామనీ చెప్పారు. భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న కలహాల్ని ఇందులో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశామనీ, తొలి రీలు నుంచి చివరి వరకూ ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తుందనే నమ్మకం ఉందనీ దర్శకుడు రమణ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, గిరిబాబు, ఎంఎస్ నారాయణ, జీవా, బాబూమోహన్, శ్రీనివాసరెడ్డి, గీతాసింగ్, బాబిలోనియా తదితరులు నటిస్తున్నారు. కల్యాణ్ సమి సినిమాటోగ్రఫీ, మోహన్ రామారావు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|