'సిద్ధం' రివ్యూ
రామ్ గోపాల్ వర్మను తన గురువుగా చెప్పడానికి జె.డి.చక్రవర్తి ఎప్పుడూ వెనక్కి పోరు. అయితే ఈసారి...రామూ ఎంత గురువైనా 'నా బిడ్డకు నేనే తండ్రిని' అని జె.డి. చెప్పుకోవడం విశేషం. ఇదంతా 'సిద్ధం' సినిమా గురించి జె.డి. చేసిన వ్యాఖ్యలే. కథ గురువుగారే ఇచ్చారు. బాగా నచ్చి సినిమా చేశాం. అయితే నాదైన ముద్ర సినిమాపై ఉంది...అని ఆయన చెప్పడం, సినిమాకు ఇచ్చిన పబ్లిసిటీ, 'డాక్టర్ల వైద్యం చేస్తారు. ఇంజనీర్లు నిర్మిస్తారు. నేను చంపుతాను' అనే ట్యాగ్ లైన్ జాగ్రత్తగా ఫాలో అయిన వాళ్లకు 'సిద్ధం' సినిమా కథా కమామిషు ఏమిటో ఈజీగా అర్ధమైపోతుంది. వర్మ కార్పొరేషన్ నుంచి షిమత్ అమిన్ దర్శకత్వంలో నాలుగేళ్ల క్రితం హిందీలో వచ్చిన 'అబ్ తక్ చప్పన్' సినిమాను డైరెక్టెగా లిఫ్ట్ చేస్తే అదే నేటి 'సిద్ధం' అయింది. నిన్నకాక మొన్నే ఈ సినిమా టీమ్ 'హోమం' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. దీనికి హాలీవుడ్ 'ది డిపార్డెట్' స్ఫూర్తి. జె.డి.లో మంచి ఫైర్ ఉంది. ఆయన టేకింగ్ లో అది కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది. అయితే కథావస్తువులో రియాలిటీ చూపించాలనే తపనతో ఒరిజినాలిటీ (లిఫ్టింగ్ కారణంగా) మిస్ అవుతున్నారు. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకోవాలంటే టేకింగ్ ఒక్కటే సరిపోదు. డూప్లికేట్ ముద్ర తొలగించుకుని ఒరిజినల్ ప్రోడక్టులను అందించాల్సి ఉంటుంది. జగపతిబాబు బాగా నటించాడా? నానా పటేకర్ బాగా చేశారా? అని జనం పోల్చుకోకూడదు. నానాపటేకర్ ను చూశాం కాబట్టి...జగపతిబాబును చూడటమెందుకని ప్రేక్షకుడు సరిపుచ్చుకోకూడదు. కొద్దిసేపు 'అబ్ తక్..'ను పక్కన పెట్టి జె.డి. రెడీ చేసిన 'సిద్ధం' వైపు ఓసారి చూద్దాం.
దయానంద్ (జగపతిబాబు) ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. సంఘ విద్రోహ శక్తులకు సింహస్వహ్నం. సిన్సియర్ ఆఫీసర్ గా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతుంటాడు. దుష్టశక్తులను ఏరిపారేయడంలో చంపడానికైనా చావడానికైనా సిద్ధం అనేది అతని కమిట్ మెంట్. అయితే అలాంటి అరాచక శక్తులను చంపే ముందు, చంపిన తర్వాత అతను ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తుంటాడు. ఎన్ కౌంటర్లలో అతనిదే రికార్డు అయినా అనవసరంగా ఎవరినీ చంపకూడదు, అవసరమైతే చంపడానికి వెనుకాడకూడదని తన సబార్డినేట్స్ కు తర్ఫీదు ఇస్తుంటాడు. దుబాయ్ లో ఉంటూ హైద్రాబాద్ లో నెట్ వర్క్ సాగిస్తున్న మాఫియా డాన్ బిలాల్ (ముకుల్ దేవ్ )కు దయానంద్ కొరుకుడుపడడు. నయానో భయానో నచ్చజెప్పే ప్రయత్నం దుబాయ్ నుంచే చేస్తుంటాడు. దమ్ముంటే హైద్రాబాద్ రమ్మని దయానంద్ సవాలు విసురుతుంటాడు. బిలాల్ ముఠా వాళ్లను ఒక్కొక్కరినే ఎన్ కౌంటర్ చేస్తుంటాడు దయానంద్. అంతా సజావుగా ఉన్న సమయంలో పాత కమిషనర్ (కోట) రిటైర్ కావడంతో ఆ ప్లేస్ లో శివలెంక ప్రసాద్ (రాధారవి) వస్తాడు. ఆయనకు బిలాల్ ప్రత్యర్థి ముఠా అయిన ఛోటా గ్యాంగ్ తో సంబంధాలు ఉంటాయి. కమిషనర్ వచ్చినప్పటి నుంచి దయానంద్ కు సమస్యలు మొదలవుతాయి. వ్యక్తిగత జీవితంలోనూ అలజడి మొదలవుతుంది. అతన్ని ప్రాణాధికంగా ప్రేమించే భార్య గౌరి (సింధుమీనన్ )ని కూడా కోల్పోతాడు. ఇందుకు కారకులైన ప్రత్యర్థులపై దయానంద్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|