'సిద్ధం' రివ్యూ
జగపతిబాబు పాత్రలోని ఫోర్స్ ను మొదట్ని సన్నివేశం నుంచి చివరి వరకూ ఎక్కడా బిగి సడలకుండా నడింపించడంలో దర్శకుడు జె.డి. పడిన కష్టం, తగిన రీసెర్చ్ వర్క్ కూడా కనిపిస్తుంది. లెగ్తీ సంభాషణలు కానీ, సన్నివేశాల జోలికి గానీ వెళ్లకుండా సరైన మోతాదు పాటించారు. ఛోటా అనే వ్యక్తి ప్రస్తావన చివరి వరకూ ఉంటుంది కానీ ఆ వ్యక్తి ఎవరనేది సినిమాలో చూపించలేదు. బహుశా ఇది సస్పెన్స్ కోసమే కావచ్చు. లేకుంటే ఈ సినిమాకి సీక్వెల్ ఆలోచన జె.డి.లో ఉండి ఉండొచ్చు. సీరియస్ సినిమాలోనూ వినోదం (కామెడీ) వెతుక్కునే ప్రేక్షకులను జె.డి. విస్మరించారు. అయితే ఒక్క పాట కూడా లేకపోవడం కథాగమానికి యాప్ట్ గానే చెప్పుకోవాలి.
ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా జగపతిబాబు పతాక స్థాయి నటన ప్రదర్శించారనడంలో అతిశయోక్తి లేదు. హెయిర్ కట్, కంటిచూపు, నడక...ఇలా ప్రతీ విషయంలోనూ ఆయన తీసుకున్న శ్రద్ధ మెచ్చుకోలుగా ఉంది. భార్య పట్ల, కూతురు పట్ల ఆప్యాయతానురాగాలు కురిపించే సన్నివేశాల్లోనూ చక్కగా ఒదిగిపోయారు. సింధుమీనన్ అనుకూలవతి అయిన భార్యగా తన పాత్రకు న్యాయం చేసింది. ముకుల్ దేవ్ సాఫ్ట్ విలనీ ఆకట్టుకుంటుది. కొన్ని సందర్భాల్లో కామెడీ కూడా జనరేట్ చేశారు. జగపతిబాబు అసిస్టెంట్లుగా చేసిన అఖిల్, సలీం పాత్రధారలు కూడా గుర్తుండిపోతారు. మరో అసిస్టెంట్ నర్సింగ్ యాదవ్ అక్కడక్కడా నవ్వించారు. కోట, రాధారవితో పాటు గెస్ట్ పాత్రలో సుబ్బరాజు, డాక్టర్ శివప్రసాద్ నటన కూడా ఓకే.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|