'సిద్ధం' రివ్యూ
సాంకేతికపరంగా భరణి కె ధరణ్ సినిమాటోగ్రఫీ, భానోదయ్ క్రిస్ప్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి. సాంగ్స్ కు అవకాశం లేకపోయినా కథాగమనానికి అమర్ మొహైల్ బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్ బలం చేకూర్చింది. జె.డి. చక్రవర్తి సంభాషణా చాతుర్యం కనిపిస్తోంది. జనాల్లో ఉన్న వాడుక పదాలే తేలిగ్గా ఉపయోగించారు. 'జి..లో దమ్ముంటే హైద్రాబాద్ రారా', 'ఒరేయ్ ఒరేయ్ చెత్త నా కొడకా' వంటి పదప్రయోగాలు ఈ కోవలోనివే. 'చావడం తేలిక. చంపడం కష్టం', 'మీసమా...ముద్దులా..ఈలలా ఎవరు గెలుస్తారు?' (ఇవాల్టి రాజకీయ నాయకుల ప్రచార చేష్టలపై సెటైర్ ), 'టెర్రరిస్టులంతా ముస్లింలే కావచ్చు...కానీ ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు' వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి.
నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ సైతం రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ పాటించారు.
జగపతిబాబు నటన, జె.డి. టేకింగ్ మాస్ అడియెన్స్ ను థియేటర్లకు రప్పించ గలుగుతాయి. అయితే వినోదం, కలర్ ఫుల్ సాంగ్స్ లేకపోవడం వల్ల రిపీటెడ్ ఆడియెన్స్ కు అవకాశాలు తక్కువ. ఓవరాల్ గా మల్టీప్లెక్స్ లకు ఉద్దేశించిన సినిమాల జాబితాలో దీనిని చేర్చొచ్చు. 'అబ్ తక్ చప్పన్'ను చూసిన వాళ్ల కంటే చూడని వాళ్లకు 'సిద్ధం' ఫరవాలేదనిపిస్తుంది. మంచి ప్రమోషన్ వల్ల బెటర్ రిజల్ట్ రావచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|