'సత్యమేవ జయతే' రివ్యూ
దర్శకురాల జీవిత సన్నివేశాల ఆర్డర్ లో మరింత శ్రద్ధ తీసుకుని ఉండొచ్చు. హీరో తన భార్యను కోల్పోయిన ఎపిసోడ్ షడన్ గా ఊడిపడినట్టు కనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ కు తరువాత సన్నివేశం కనెక్టివిటీ కాదు. అలాగే కథ వెనుక సూత్రధారులైన హోం మంత్రి, కమిషనర్ పాత్రలను కూడా కొద్దిపాటి సస్పెన్స్ తో రివీల్ చేసుండొచ్చు. అందువల్ల కథలో పట్టు పెరిగేది. నటి అపూర్వ వెనుక భాగంలో రాజశేఖర్ బాదడం, రాజశేఖర్ ఫోటో చేతిలో తీసుకుని నీతూచంద్ర చెప్పే డబుల్ మీనింగ్ సంభాషణలు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఇలాంటి వాటని మహిళా దర్శకురాలుగా జీవిత దూరంపెట్టి ఉండొచ్చు. మదర్ థెరిస్సా ఫోటోను పబ్సిసిటీ పోస్టర్ లో వాడుకున్న అపూర్వతో 'ఛారిటీ అనేది ఇంట్లో మొదలవాలి. మదర్ ఏమైనా ప్రమోటరా?' అని రాజశేఖర్ నిలదీసే ఘట్టం ఎవరిపైన విసిరిన సెటైరో ఈజీగానే ఊహించొచ్చు. ఆ సన్నివేశాన్ని దర్శకురాలు సందర్భోచితంగా రక్తి కట్టించారు.
హీరో రాజశేఖర్ కు పోలీస్ పాత్రలు కొట్టిన పిండి కావడంతో మరోసారి తన పాత్రకు న్యాయం చేశారు. 'అంకుశం' నాటికీ ఇప్పటికీ ముఖంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశారు. ఎందుకో ఈసారి రాజశేఖర్ కు డబ్బింగ్ చేసిన సాయికుమార్ వాయిస్ లో గాంభీర్యం పాళ్లు తగ్గాయి. సంజన ఫరవాలేదు. నీతూచంద్ర గ్లామర్ ప్రదర్శనకు ఇతోథికంగా సాయపడింది. ఎం.సత్యనారాయణరావు నాలుగైదు సన్నివేశాల్లో కనిపించి తన పాత్రకు న్యాయం చేశారు. మిలంద్ సోమన్
గెటప్ లో గానీ, నటనలో గానీ ప్రత్యేకతలు కనిపించవు. రొటీన్ తరహా పాత్రల్లో సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్ నటించారు. పోలీస్ ఎస్.ఐ.గా శివాజీకి కొద్దిపాటి బరువున్న పాత్ర లభించింది. ఉన్నంతలో తన పాత్రను బాగానే పోషించారు. శివారెడ్డి పాత్ర కొద్దిపాటి సానుభూతికి నోచుకుంటుంది. సాయికిరణ్ పాత్రకు ఏమాత్రం వెయిట్ లేదు. ముస్లిం తల్లిగా సీనియర్ నటి జయంతిని చాలకాలం తర్వాత చూసిన మంచి అనుభూతి కలుగుతుంది.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3-
|