'సత్యమేవ జయతే' రివ్యూ
చిన్నా సంగీతం సమకూర్చిన పాటల్లో గుర్తుండిపోయేవి లేవు. అయితే ఒక మృతదేహాన్ని ఖననం చేస్తున్నప్పడు వచ్చే ఓ బిట్ సాంగ్ బాగుంది. బ్రౌక్ గ్రౌండ్ మ్యూజిక్ బలహీనంగా ఉంది. రాజశేఖర్ రాసిన సంభాషణల్లో 'పొలిటీషియన్లు పెంచకపోతే దేశంలోకి టెర్రరిస్టులు ఎలా వస్తారు?', 'పోలీసులకు ప్రభుత్వం పూర్తి అధికారం ఇస్తే పిల్లల చేతిలో ఉండే బొమ్మలు లాక్కుకునే దమ్ము కూడా తీవ్రవాదులకు ఉండదు' వంటివి కొద్దిగా ఆలోచించపజేస్తాయి. నిర్మాణ విలువలకు తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం డల్ గా, సాదాసీదీగా ఉంటే, ద్వితీయార్థం యాక్షన్ ఎపిసోడ్లతో కొంత వేగం పెరిగినా క్రమపద్ధతిలో నేరేషన్ లేకపోవడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష అవుతుంది. కథను సక్రమంగా ప్రెజెంటేషన్ చేయడానికి మారుగా కేవలం రాజశేఖర్ కు ఉన్న యాంగ్రీ పోలీస్ ఇమేజ్ ను ప్రతి సన్నివేశంలోనూ వాడుకుని, సాధ్యమైనన్ని సార్లు తుపాకీ పట్టించడం ద్వారా కథాగమనంలో ఫోర్స్ తీసుకురావాలనే దర్శకురాలి ప్రయత్నం గాడి తప్పింది. బి,సి సెంటర్ల పైనే కొద్దిపాటి హోప్స్...
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3
|