అనుష్క మార్షల్ ఆర్ట్స్
సిక్స్ ప్యాక్స్ , మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వంటివి కథానాయకులకే సహజంగా పరిమితమవుతుంటాయి. హీరోయిజం కోసం ఇవన్నీ సహజమవుతుంటాయి. హీరోయిన్లకు వీటితో పెద్దగా పనుండదు. గ్లామర్ ను కాపాడుకుంటూ నటన, డాన్స్ లలో శిక్షణ ఉంటూ నెట్టుకొచ్చేయవచ్చు. అయితే ఇప్పుడు నవతరం హీరోయిన్లు ఒకడుగు ముందే ఉంటున్నారు. జీరో షేప్ కోసం కష్టపడటం, యోగా, ఎక్స్ ర్ సైజులతో తమ బాడీని ఫిట్ గా మలుచుకుంటున్నారు. యోగా టీచర్ గా ఉంటూ 'సూపర్' గాళ్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు 'అరుంధతి'గా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన అనుష్క మరో అడుగు ముందుకు వేసి మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందుతుండటం విశేషం. యోగా వచ్చు కాబట్టి శరీరాన్ని విల్లులా వంచే మార్షల్స్ ఆర్ట్స్ సునాయాసంగానే ఆమె అభ్యశిస్తున్నారట. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'బిల్లా' చిత్రంలో తన పాత్ర బాగా పండాలనే పట్టుదలతోనే అనుష్క ఈ కాయకష్టం చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ దర్శకుడుగా 'బిల్లా' రూపొందుతోంది. ఇందులో ప్రతీకారం తీర్చుకునేందుకు తపన పడే పాత్రలో అనుష్క నటిస్తోంది. పాత్రలో మరింత పెర్ ఫెక్షన్ కోసం అనుష్క మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు.
బిల్లా చిత్రంలో తాను చాలా స్టయిలిష్ గా కనిపిస్తాననీ, కాస్ట్యూమ్స్ కూడా చాలా ఢిపరెంట్ గా ఉంటాయనీ అనుష్క చెబుతోంది. 'అరుంధతి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో 'బిల్లా ' పై సహజంగానే బలమైన అంచనాలున్నాయి. దీనికి తోడు తమిళ 'పయ్యా'లోనూ అనుష్క నటిస్తోంది. ఇదే ఊపులో 'అరుంధతి' చిత్రం తమిళంలో విడుదల చేసేందుకు కూడా నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క హవా ఆమె కో-స్టార్ట్స్ లో గుబులురేపుతోంది కూడా.
Be first to comment on this News / Article!
|