ప్రభాస్ తో కంగనా రనౌత్
పూరీ జగన్నాథ్ వరుస సక్సెస్ లకు 'నేనింతే' చిత్రం ఇటీవల బ్రేక్ వేసింది. ఈ చిత్రం తర్వాత తన సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా 'మీనాక్షి' అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన తన ప్లాన్ లో కొద్దిగా మార్పు చేసి ప్రభాస్, పవన్ కల్యాణ్ లతో సినిమాలకు రెడీ అవుతున్నారు. వీటిల్లో ప్రభాస్ చిత్రం ముందుగా సెట్స్ పైకి రాబోతోంది. పూరీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటుడు గణేష్ నిర్మించనున్న చిత్రం ఆ తరువాత ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ తో చేయనున్న చిత్రం కోసం పూరీ జగన్నాథ్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్టును కూడా రెడీ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ సమర్పణలో ఆదిత్యరామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవల పూరీ-అదిత్యరామ్ కాంబినేషన్ లో ప్రకటించిన 10 చిత్రాల్లో ఇది ఒకటి కానుంది. 'బుజ్జిగాడు' తర్వాత పూరీ జగన్నాథ్, ప్రభాస్ కలిసి పనిచేయనుండటం ఇది రెండోసారి. ఆసక్తికరంగా ఈ చిత్రంలో ప్రభాస్ జోడిగా బాలీవుడ్ తాజా సంచలనం కంగనా రనౌత్ ను పూరీ జగన్నాథ్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
కంగనా రనౌవత్ ఇప్పుడు బాలీవుడ్ హాటెస్ట్ సంచలనంగా పేరు తెచ్చుకుంది. 'ఫ్యాషన్', 'రాజ్ -2' చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టగా, ప్రస్తుతం హృతిక్ ' కైట్స్'లోనూ ఆమె నటిస్తోంది. తెలుగులో ఆమెను పరిచయం చేయాలని గతంలో పలువురు నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ బాలీవుడ్ లో బిజీగా ఉండటం వల్ల ఆ ఆఫర్లను కంగనా తోసిపుచ్చింది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ ఇచ్చిన ఆఫర్ కంగనాకు నచ్చినట్టు తెలుస్తోంది. పూరీ తీసిన 'పోకిరి' సంచలన విజయం సాధించడం, ఆయన పరిచయం చేసిన హీరోయిన్లు పలువురు మంచి పొజిషన్ లో ఉండటం కూడా కంగనా ఈ ఆఫర్ ఒప్పుకోవడానికి కారణాలుగా తెలుస్తోంది. గతంలో ఆయన 'బద్రి'తో అమీషా పటేల్, 'సూపర్'తో అయేషా టకియా, 'దేశముదురు'తో హన్సిక, 'బుజ్జిగాడు'తో సంజన వంటి పలువురు హీరోయిన్లను పరిచయం చేశారు. పూరీ ఏ పని చేసినా సంచనాలను వెంటే ఉంటాయి కాబట్టి ఈసారి కంగనతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారనేది చూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|