ఎన్టీఆర్ సినిమా 'అదుర్స్'
ఏదైనా ఒక సినిమా చాలా బాగుందని చెప్పాలంటే సింగిల్ వర్డ్ లో 'అదుర్స్' అని చెబుతుంటాం. ఇదే సినిమా టైటిల్ అయితే ఇక అదరహో అన్నమాటే. యంగ్ స్టార్ ఎన్టీఆర్, క్రియేట్రివ్ డెరెక్టర్ వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ప్రస్తుత శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న చిత్రానికి 'అదుర్స్ ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో నిర్మాతలు టైటిల్ విషయంలో ఒకటి రెండు ఫీలర్లు వదిలి, జనానికి చేరువైన టైటిల్ నే అధికారికంగా ప్రకటించడం సర్వసాధారణమైంది. ఇందులో భాగంగానే 'అదుర్స్ ' ఫీలర్ బయటకు వచ్చింది. 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్, వినాయక్ కలిసి నటిస్తుంటడంతో సహజంగానే ఈ చిత్రంపై మొదట్నించీ అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా 'మస్కా' పాప షీలా నటిస్తోంది. ఎన్టీఆర్ సైతం ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.
ఆసక్తికరంగా నయనతార ఈ చిత్రంలో బికినీ షో చేయబోతోందట. ఇప్పటికే తమిళనాట 'బిల్లా' చిత్రంలో నయనతార బికినీ షో ఇచ్చి సంచలనం సృష్టించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె 'షో ' తిలకించ వచ్చు. ప్రస్తుతం చిత్ర యూనిట్ తాష్కెంట్ లో ఓ పాట చిత్రీకరణ జరుపుతున్నారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. ఈనెల 22 వరకూ పాట చిత్రీకరణ జరుగునుంది. వైష్ణవీ ఆర్ట్స్ బ్యానర్ పై కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|