'బంగారుబాబు' వాయిదా
జగపతిబాబు, మీరాజాస్మిన్ జంటగా రూపొందిన 'బంగారు బాబు' చిత్రం ఈ వారంలో విడుదల కావలసి ఉండగా కారణాంతరాల వల్ల వాయిదా పడినట్టు సమాచారం. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీమతి దాసరి పద్మ సమర్పకురాలిగా సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలుత ఈ చిత్రాన్ని ఈనెల 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇదే రోజు పలు చిత్రాలు పోటాపోటీగా విడుదలవుతున్న నేపథ్యంలో విడుదల తేదీని మరో వారం రోజులు వాయిదా వేయాలని నిర్మాతలు నిశ్చయించినట్టు తెలిసింది.
ఈనెల 20న నందమూరి తారకరత్న హీరోగా రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో రూపొందిన 'వెంకటాద్రి', ఛార్మి కథానాయికగా సోలమన్ దర్శకత్వంలో రూపొందిన '16 డేస్', నితిన్-ప్రియమణి జంటగా జె.కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ద్రోణ'చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటికితోడు శివాజీ-కావేరీ ఝా జంటగా ఎ.నాగేంద్రకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్', రఘుబాబు-శివాజీరాజా హీరోలుగా కె.వి.రమణ దర్శకత్వంలో రూపొందిన 'మొండిమెగుళ్లు పెంకి పెళ్లాలు' చిత్రాలు కూడా ఇదేరోజు విడుదల తేదీని ప్రకటించాయి
Be first to comment on this News / Article!
|