సాంకేతికపరంగా సుకుమార్ సినిమాటోగ్రఫీ మెచ్చుకోలుగా ఉంది. నివాస్ మాటల్లో పదును లేదు. 'అమెరికాలో ఎంజెలినా జోలి అయితే ఇండియాలో ఏంజిల్ జాలీ' అనే ఒకటి రెండు సంభాషణలు మాత్రం గుర్తుంచుకోవచ్చు. ధరణ్ సంగీతం ఫరవాలేదు. ఫస్ట్ నైట్ సాంగ్ మాత్రం ఒకటికి రెండు సార్లు వినాలనిపించేలా ఉంది. దర్శకుడు ప్రభు సోల్మన్ టేకింగ్ స్టయిలిష్ గా ఉన్నప్పిటకీ స్క్రిప్టు బలహీనతల నుంచి తప్పించుకోలేకపోయరు.
ప్రథమార్థం ఏ దశలోనూ ఉత్సుకత క్రియేట్ చేయకపోవడం ఓ ఎత్తయితే ద్వితీయార్థం దీనికి కొనసాగింపుగానే చెప్పాలి. క్లైమాక్స్ తేలిపోయింది. జస్ట్ ఎ మినిట్...అన్నట్టుగా చివర్లో టైటిల్స్ రన్ చేస్తూ మరికొన్ని క్లిప్పింగ్స్ చూపించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం కూడా ఆశించలేం. ఓవరల్ గా....సినిమా రన్ ను ఉద్దేశించే టైటిల్ ను (16 డేస్ ) నిర్దేశించి ఉంటారని ప్రేక్షకుడు అనుకున్నా తప్పుపట్టలేం...