'ద్రోణ' రివ్యూ
దర్శకుడు కరుణ కుమార్ ఎంచుకున్న స్టోరీని మరింత బాగా ఎగ్జిక్యూట్ చేసుండొచ్చు. సెంటిమెంట్ కు మంచి అవకాశమున్న సన్నివేశాల్లో ఆయన తగిన శ్రద్ధ పెట్టి ఉంటే డెప్త్ కనిపించేది. వేణుమాధవ్ సెపరేట్ కామెడీ ట్రాక్ కథాగమనానికి అడ్డుపడటం స్పష్టంగా కనిపిస్తుంది. ఐలాండ్ సన్నివేశాలు, హీరోని హెలికాప్టర్ చేజ్ చేసే సన్నివేశంతో సహా పలు యాక్షన్ ఎపిసోడ్లను మాత్రం దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు. అయితే ఇలాంటి ట్రాక్ లన్నీ చాలా సినిమాల్లో చూసినవే కాబట్టి దర్శకుడు ఇకముందైనా ఇన్నొవేటివ్ ఐడియాస్ తో ముందుకు వస్తే కమర్షియల్ డైరెక్టర్ గా నిలదొక్కుకోవచ్చు.
నితిన్ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. డాన్స్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ లో రాటుదేలుతున్నాడు. ఎటొచ్చీ సబ్జెక్ట్ సెలక్షన్ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. లేకుండే ఇవాల్టి హీరోల పోటీని తట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ప్రియమణి తొలిసారి బికినీలో నటించి తన గ్లామర్ ను పదునుపెట్టింది. వానపాటలో అందాలు ఆరబోసినా లాంగ్ షాట్స్ ఎక్కువ కావడంతో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. గ్లామర్ పరంగా జనాలను ఆకట్టుకోగలిగిన సత్తా చూపినా జాతీయ ఉత్తమనటిగా ఇందులో నటనకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. కెల్లీ డార్జి విలనీ సాదాసీదా వ్యవహారమే. అతని కంటే అతనికి సలహాలిచ్చే వ్యక్తిగా డాక్టర్ శివప్రసాద్ ఒకింత ఎక్కువ విలనీ చూపించాడు. ముఖేష్ రిషి, సీత తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియమణి బావగా సునీల్ గెస్ట్ రోల్ లో కామెడీ పెద్దగా పండలేదు. వేణుమాధవ్ కామెడీ తుస్సుమన్నట్టే. పేరడీలు చేయడంలో ముందుండే వేణుమాధవ్ అప్పుడే 'బొమ్మాళీ నిన్నువదలా' అంటూ అరుంధతిలోని సోనూసూద్ పేరడీ చేశారు. రాఖీ సావంత్ ఓ ఐటెంసాంగ్ లో తళుక్కుమంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|