'ద్రోణ' రివ్యూ
సాంకేతికపరంగా భూపతి ఫోటోగ్రఫీ పనితనం యాక్షన్ ఎపిసోడ్స్ లోనే అడపాదడపా కనిపిస్తుంది. హర్షవర్దన్ సంభాషణల్లో పంచ్ తక్కువ. 'తప్పు చేసే వాడికి భయం కారణం కాదు. అదో సాకు' , 'స్వేచ్ఛగా ప్రేమించడం కాదు. ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి' వంటి సాదాసీదా సంభాషణలతోనే సరిపెట్టారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఫరవాలేదు. 'వద్దంటానా వద్దంటానా నను ముట్టుకుంటే వద్దంటానా' , 'ఏం మాయ చేశావు..నను మైకంలో ముంచేశావు' పాటలు మాస్ ను హుషారు గొలుపుతాయి. డిఎస్ రావు నిర్మాణ విలువలు తగినట్టుగానే ఉన్నాయి.
ప్రియమణి గ్లామర్ , నితిన్ డాన్స్ లు, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి ఆకర్షణ అయితే, పేలవమైన కామెడీ, సెకెండాఫ్ లో వచ్చే ఐలాండ్ బ్యాక్ డ్రాప్ కథతో సరిగ్గా కనెక్టివిటీ కాకపోవడం వంటివి ప్రేక్షకుల అంచనాలను రీచ్ కావు. క్లైమాక్స్ సాదాసీదా వ్యవహారంగా తేలుతుంది. నితిన్ గత ఫెయిల్యూర్ చిత్రాలతో పోలిస్తే 'ద్రోణ' కొన్నిరకాలుగా బెటర్. దిగువ తరగతి ప్రేక్షకులే ఈ చిత్రానికి రాజపోషకులవుతారు. పబ్లిసిటీ పెంచితే మరీ ఎక్కువ ఆశించకపోయినా ఎంతో కొంత సేఫ్ ప్రాజెక్ట్ కావచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|