రామ రామ కృష్ణ కృష్ణ
ఇవాల్టి యువ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న రామ్ ఇంతవరకూ నాలుగు సినిమాల్లో నటించి మూడు హిట్లు కొట్టారు. 'దేవదాసు', 'రెడీ' చిత్రాలు సిల్వర్ జూబ్లీ హిట్టయితే, మధ్యలో వచ్చిన 'జగడం' ఫెయిలైంది. ఈ సంక్రాంతికి విడుదలైన 'మస్కా' సైతం కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుని రామ్ ను మరింత బిజీ చేసింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ 'రెడీ' నిర్మాత స్రవంతి రవికిషోర్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిన్న పిల్లలను ఆకట్టుకునే కథాకథనాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత రామ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి 'లక్ష్యం' చిత్రంతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అనిపించుకున్న శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ పూర్తి కావచ్చింది. ఈ చిత్రానికి 'రామ రామ కృష్ణ కృష్ణ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పూర్తి మాస్ తరహా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కించనున్నారు.ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. స్రవంతి రవికిషోర్ చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుంది.
Be first to comment on this News / Article!
|