దిల్ రాజు పంపిణీలో 'బోణి'
హీరోల్లో నిదానమే ప్రధానం అనుకుంటూ వస్తున్ సుమంత్ కొద్ది గ్యాప్ తర్వాత 'బోణి' తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరీర్ ఆరంభంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న సుమంత్ 'సత్యం'తో తొలి హిట్ కొట్టారు. ఆ తర్వాత 'గౌరి', 'గోదావరి' వంటి సక్సెస్ లు కూడా దక్కించుకున్నారు. 'మధుమాసం' ఫరవాలేదనిపించుకుంది. అయితే ఇటీవల కాలంలో సుమంత్ కు మళ్లీ సరైన బ్రేక్ దొరకలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈసారి పట్టుదలగా మళ్లీ హిట్ 'బోణి' కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల ఈ చిత్రం ద్వారా తొలిసారి నిర్మాతగా మారారు. గ్రీన్ మ్యాంగోస్ పతాకంపై ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్ పిప్పళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రం పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నట్టు ట్రేడ్ వర్గాల భోగట్టా.
నిర్మాతగా ఇటీవల 'కొత్త బంగారులోకం' వంటి హిట్ ను సాధించిన దిల్ రాజు సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా విజయకేతనం ఎగరేస్తున్నారు. ఆయన ఇటీవల పంపిణీ చేసిన 'హ్యాపీడేస్', 'వినాయకుడు', 'యువత' వంటి చిత్రాలు హిట్ సాధించాయి. దీంతో దిల్ రాజు పంపిణీలో సినిమా వస్తే సక్సెస్ ఖాయమనే బ్రాండ్ కూడా ఆయనపై పడింది. ప్రస్తుతం ఆయన ప్రకాష్ రాజు తమిళంలో నిర్మించిన చిత్రాన్ని తెలుగులో 'ఆకాశమంత' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. నాగార్జున తనయుడు నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ 'జోష్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ సందేష్ తో 'మరో చరిత్ర', హీరో రామ్ తో మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు సుమంత్ 'బోణి' హక్కులను తీసుకోవడం కూడా ఆ సినిమాకి కలిసొచ్చే అంశంగానే చొప్పొచ్చు. సుమంత్ కు ఈసారి సరైన సక్సెస్ దక్కే అవకాశాలు కూడా మెరుగయ్యాయి.
Be first to comment on this News / Article!
|