ముక్కంటే కాపాడాలి!
నందమూరి మూడో తరం నట వారసులు మొదట్లో ఒకటి రెండు ఫ్లాపులు చవిచూసినా ఆ తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. అయితే నందమూరి తారకరత్న నిరీక్షణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దికాలంగా ప్రేక్షకుల ముందుకు రాని తారకరత్న ఎట్టేకలకు అజ్ఞాతం వీడి 'వెంకటాద్రి'గా గత వారం ప్రేక్షకుల మందుకు వచ్చినా ట్రేడ్ రిపోర్డ్ బలహీనంగా ఉంది. ఇటీవల పొలిటికల్ వేదకపైకి వచ్చి బాబాయ్ బాలకృష్ణ కాబోయే సిఎం అంటూ నందమూరి అభిమానుల దృష్టిని ఆయన ఆకర్షిస్తూ వచ్చారు. జనంలోకి వెళ్లడ వల్ల తన సినీ కెరీర్ కూడా వేగవంతం అవుతుందని ఆశించిన తారకరత్నకు 'వెంకటాద్రి' ఫలితం మరోసారి నిరాశకు గురిచేస్తోంది.
ఒకేసారి తొమ్మిది సినిమాల ప్రారంభోత్సవాలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన హీరో క్రెడిట్ తారకరత్నకే దక్కుతుంది. అయితే కారణాంతరాల వల్ల కొన్ని సినిమాలు ఆ తర్వాత సెట్స్ మీదకు కూడా రాలేదు. 'ఒకటో నెంబర్ కుర్రాడు'తో పరిచయమై, 'నో', 'భద్రాద్రి రాముడు' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ మాత్రం ముఖం చాటేస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొద్ది కాలంగా ఆయన నటించిన చిత్రం ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలో తారకరత్న రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సినీ కెరీర్ ను పట్టాల మీదకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా తమ సొంత సంస్థ అయిన రామకృష్ణా సినీ స్టూడియోస్ తీసిన 'వెంకటాద్రి' ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. గతంలో పలు విజయవంతమైన చిత్రాలు ఈ బ్యానర్ లో రూపొందడం, కమర్షియల్ గా కొన్ని సక్సెస్ లు ఇచ్చిన వి.సముద్ర ఈ తాజా చిత్రానికి దర్శకుడు కావడం సహజంగానే తారకరత్న ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీవీ ఇంటర్వ్యూలతో పబ్లిసిటీ కూడా చేపట్టారు. అయినప్పటికీ ఈ చిత్రం జనాలను థియేటర్లకు రప్పించలేకపోతోందని ట్రేడ్ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. నిర్మాణంలో జరిగిన జాప్యం కూడా ప్రతికూల ఫలితానికి కారణమవుతోందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్నను ఆ ముక్కంటే కాపాడాలని వారంటున్నారు. తారకరత్న కథానాయకుడు రెండేళ్ల క్రితం రాజ్ కృష్ణ దర్శకత్వంలో 'ముక్కంటి' ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం కూడా జరుపుకొంది. త్వరలోనే ఈ చిత్రం వెలుగుచూసి తారకరత్నను ఆదుకుంటుందేమో చూడాలి...
Read 1 Comment(s) posted so far on this News / Article!
|