28న 'సునామీ 7-X'
అంకిత ప్రధాన పాత్రలో రూపొందిన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ 'సునామీ 7-ఎక్స్'. ఎమ్మెల్యే కరణం బలరాం ఆశీస్సులతో వెంకట సాయి ఫిలిమ్స్, వి.ఇంటర్నేషనల్ పతాకంపై ముత్యాల రాందాసు, జి.మధుకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎం.ఎ.చౌదరి దర్శకుడు. ఈనెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలియజేశారు.
అంకిత ఇంతవరకూ చేయనటువంటి పాత్రలో చాలా అద్భతంగా ఈ చిత్రంలో నటించిందనీ, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేశారనీ నిర్మాత ముత్యాల రాందాస్ తెలియజేశారు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చిందనీ, సినిమా సైతం ప్రేకదారణ చూరగొంటుందనే నమ్మకం ఉందనీ పేర్కొన్నారు. అన్ని కమర్షియల్ అంశాలు జోడించి ఎక్కడా ఖర్చుకు రాజీపడకుండా రూపొందించిన సస్పెన్స్ ఎంటర్ టైనర్ ఇదని దర్శకుడు చౌదరి తెలిపారు. ఈ చిత్రానికి కల్యాణ్ సమి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణ భగవాన్, జీవా, చిత్రం శ్రీను శివ పార్వతి, గౌతంరాజు, రఘుబాబు, బాబిలోనియా తదితరులు నటించారు. రవీంద్ర దేశాయ్ సంభాషణలు, పాటలు అందించగా, గోరంట్ల కృష్ణ సంగీతం సమకూర్చారు.
Be first to comment on this News / Article!
|