ఉగాదికి వస్తున్న 'రోమియో'
ఆర్యన్ రాజేష్ హీరోగా, శ్రద్దఆర్య హీరోహీరోయిన్లుగా సుధ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మిస్తున్న 'రోమియో' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి ఎ డిఫరెంట్ లవర్ అన్నది ట్యాగ్ లైన్. ప్రస్తుతం రీరికార్డింగ్ లో ఉన్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. విభిన్నమైన స్ర్కీన్ ప్లేతో, ఆర్యన్ రాజేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రోమియో చిత్రాన్ని మలుస్తున్నామని దర్శకుడు రామకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయిందనీ, మిగిలిన ఆ రెండు పాటలను మార్చి 5 నుండి హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరిస్తామని అన్నారు. ఇంతవరకు కనిపించని రీతిలో శ్రీహరి పాత్ర ఉంటుందన్నారు. ఈ చిత్రం ఆడియోను మార్చి 12ను, ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. రోమియో చిత్రంలో శ్రీహరి, ఆర్యన్ రాజేష్ పాత్రలు నువ్వా నేనా అన్న రీతిలో ఉంటాయని శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, తనికెళ్ళభరణి, చరణ్ రాజ్, సుమన్ శెట్టి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. రమణ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించగా, ఎడిటింగ్ శంకర్, నిర్మాత శ్రీనివాస్, వనమాలి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|