రవిబాబు 'ఏజెంట్ గోపి'
టైటిల్స్ తరహాలోనే రవిబాబు దర్శకత్వం వహించే సినిమాలు కొత్తగా, కొంచెం గమ్మ్తత్తుగా ఉంటాయి. న్యూ జనరేషన్ సబ్జెక్ట్ లు, టెక్నాలజీతో చిన్న సినిమాలు తీసి కొన్ని హిట్లు కొట్టారాయన. 'అల్లరి', 'అమ్మాయిలు అబ్బాయిలు', 'అనసూయ' వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన రవిబాబు ఇటీవల 'నచ్చావులే' చిత్రంతో మరో హిట్ కొట్టారు. కుక్కలు, కోతులతో ఆయన ఈ చిత్రానికి చేసిన పబ్లిసిటీ ఆకట్టుకుని సినిమా విజయానికి దోహదపడింది. నిర్మాత రామోజీరావుకు ఈ చిత్రం 6 కోట్లు తెచ్చిపెట్టిందనీ, అయితే సరైన పబ్లసిటీ ఇచ్చి ఉంటే 12 కోట్లకు చేరుకునేదనే ఓ కథనం కూడా ప్రచారంలో ఉంది. ఆ మాటెలా ఉన్నా రవిబాబు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఓ రెండు కొత్త స్క్రిప్టులు రెడీ చేసినట్టు సమాచారం. వీటిలో ఒక దానికి 'ఏజెంట్ గోపి', రెండో దానికి 'అమరావతి' అనే టైటిల్స్ నిశ్చయించినట్టు తెలుస్తోంది.
ఈ రెండింటి స్టోరై లైన్స్ పట్ల ఒకరిద్దరు పెద్ద నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారనీ, త్వరలోనే ఈ చిత్రాలు ఫైనలైజ్ అవుతాయనీ అంటున్నారు. వీటిలో ఏది ముందు ప్రారంభవుతుంది, నటీనటులు ఎవరనేది కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.
Be first to comment on this News / Article!
|