ప్రేమలో పడ్డా: శర్వానంద్
హీరో శర్వానంద్ ను చూస్తే మన పక్కింటి కుర్రాడిని చూసిన అనుభూతి కలుగుతుంది. క్లాస్ మేట్స్, వెన్నెల, వీధి, అమ్మచెప్పింది వంటి సుమారు పది చిత్రాల్లో నటించిన శర్వానంద్ కు 'గమ్యం' చిత్రం హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇదే చిత్రం తమిళ వెర్షన్ సైతం ఇటీవల విడుదలై చక్కటి విజయాన్ని అందించింది. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉన్నప్పటికీ వాటి ఎంపికలో తగినంత జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ మోహన్ బాబుతో కలిసి నటిస్తున్న 'రాజు-మహారాజు' చిత్రం తుదిదశలో ఉంది. హీరోగా మంచి పేరు వచ్చినా నెగిటివ్ పాత్రలు చేసేందుకు తాను సిద్ధమేననీ, ప్రసుత్తం కెరీర్ మీదై తన దృష్టి ఉందనీ శర్వానంద్ చెబుతున్నారు. శుక్రవారం ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇలా సాగింది...
?కొత్త ఏడాది...కొత్త విశేషాల గురించి..
-'గమ్యం' తెలుగులో పెద్ద సక్సెస్ సాధించిన విధంగానే ఆ సినిమా తమిళ వెర్షన్ ద్వారా అక్కడ కూడా పరిచయమయ్యాను. సినిమా చాలా మంచి హిట్టయింది. నటుడిగా మంచి అభినందనలు దక్కాయి. తాజాగా వినయన్ దర్శకత్వంలో 'నాలై నమదే' చిత్రంలో నటిస్తున్నాను. సమ్మర్లో సినిమా రిలీజ్ ఉంటుంది. అలాగే డాక్టర్ మోహన్ బాబు గారితో తెలుగులో నటిస్తున్న 'రాజు-మహారాజు' కూడా పూర్తి కావచ్చింది.
?రాజు-మహారాజులో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు
-చేతినిండా డబ్బు ఉండి పొగరుగా వ్యవహరించే పాత్ర నాది. ఆ తర్వాత నాలో ఎలాంటి మార్పు వచ్చిందనేది సినిమాలో చూడాల్సిందే. మనిషి బతకడానికి గాలి ఎంత అవసరమో, కుటుంబం కూడా అంతే అవసరమని చెప్పే ఇతివృత్తమిది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|