?మోహన్ బాబుతో కలిసి నటించిన అనుభూతి..
-ఆయన సీరియస్ గా ఉంటారని అంతా అంటుంటారు. మొదట్లో నేను కూడా భయపడ్డాను. ఇంకో యాంగిల్ లో చూస్తే ఆయన మనస్తత్వం ఎంత గొప్పదో బోధపడుతుంది. క్రమశిక్షణకు ఎంతో ఇష్టపడతారు. ఈ చిత్రంలో నా పెద్ద సోదరుడుగా ఆయన నటిస్తున్నారు. పొగరుగా ఉన్న తనను ఆయన ఎలా మార్చాడన్న అంశం సినిమాలో చూస్తే చాలా బాగుంటుంది.
?కథల ఎంపికలో తీసుకునే జాగ్రత్తలు
-మంచి కథలు ఎంచుకోవాలనే ప్రతి ఆర్టిస్టు కోరుకుంటాడు. అయితే ఏ కథతో సినిమా చేసినా అంతిమ నిర్ణేతలు మాత్రం ప్రేక్షకులే. 'అమ్మ చెప్పింది' చిత్రం ఎంతో బాగా ఆడుతుందని అనుకున్నాను. అయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. నా పాత్రకు మాత్రం మంచి పేరువచ్చింది. నాకు నచ్చిన కథ, మంచి పాత్ర దొరికితే ఏ భాషా చిత్రమైనా ప్రేక్షకులను మెప్పించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడతాను.
?నెగిటివ్ పాత్రలు చేస్తారా
-'వెన్నెల' చిత్రంలో నెగిటివ్ పాత్రను పోషించాను. ఇప్పుడు హీరోగా పేరొచ్చినప్పటికీ బాగా నచ్చిన నెగిటివ్ పాత్రలను పోషించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. 'నిజం' చిత్రంలో గోపీచంద్ తరహాలో ప్రత్యేకత మాత్రం ఉంది. కథ బాగుంటే మల్టీ స్టారర్ చిత్రాలకు కూడా ఓకే.