ప్రేమలో పడ్డా: శర్వానంద్
?కొత్తగా కమిట్ అయిన సినిమాలు
-చంద్ర సిద్దార్ధ దర్శకనిర్మాతగా రూపొందబోయే కొత్త చిత్రం నా బర్త్ డే సందర్భంగా శుక్రవారం ప్రారంభమవుతుంది. హీరోగా నా తరహా ప్రేమకథా చిత్రమిది. దీని తర్వాత వేరొక సంస్థ చిత్రం చేయనున్నాను. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తారు. ఆగస్టు నుంచి తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్విల్ చిత్రం చేయాలని అనుకుంటున్నాను.
?బీన్జ్ కాఫీ షాప్ వెంచర్ ఎలా ఉంది
-చాలా మంచి బిజినెస్ చేస్తోంది. కస్టమర్స్ సంతృప్తి ప్రధానంగా దీనిని ప్లాన్ చేయడంతో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి.
?ప్రేమ, పెళ్లి ముచ్చట...
- వాటి గురించి ఎలాంటి ఆలోచన లేదు. నా ధ్యాసంతా కెరీర్ మీదే ఉంది. ఇంటర్మీడియట్ లో ఉండగా ఓసారి ప్రేమలో పడ్డాను. అఫ్ కోర్స్...అది వన్ సైడ్ లవ్. అయితే ఆ ప్రేమను అప్పుడే మరిచిపోయాను.
?ఈ పుట్టిన రోజు కొత్త తీర్మానాలు తీసుకుంటారా
-కొత్త సినిమా ప్రారంభమవుతుంది. కొత్త రెజల్యూషన్స్ అంటూ ఏమీ లేవు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|