చేయందుకున్న త్రిష!
ప్రజారాజ్యం పార్టీ తరఫున స్టార్ అట్రాక్షన్ చిరంజీవి ఫ్యామిలీ అయితే, తెలుగుదేశం తరఫున నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో స్టార్ అట్రాక్షన్ ఎవరవుతారు? ప్రిన్స్ మహేష్ బాబును ప్రచారంలోకి దింపాలని గట్టి ప్రయత్నాలే జరిగినా ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయాల జోలికి వెళ్లదలచుకోవడం లేదు. కాకుంటే కృష్ణ, మహేష్ సేన తరఫున అభిమానులంతా ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారు. నాగార్జున బరిలోకి దిగకుండానే ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారాన్ని యాడ్స్ రూపంలో ఇప్పటికే చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న జయసుధను సికింద్రాబాద్ నుంచి, జీవితను ముషీరాబాద్ నుంచి, శారదను చీరాల నుంచి పోటీలోకి దింపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో పార్టీ ప్రచారానికి గ్లామర్ అట్రాక్షన్ గా త్రిష కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. ఇటు యూత్ నూ, అటు మాస్ నూ ఆకట్టుకునే కెపాసిటీ త్రిషకు ఉందంటూ ఆమె కోసం ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇరవై రోజుల కాల్షీట్ల కోసం 2 కోట్ల రూపాయల టెమ్టింట్ ఆఫర్ త్రిషకు ఇచ్చారని తెలుస్తోంది. మంచి ఆఫర్ కావడంతో త్రిష కూడా కాదనకపోవచ్చని, త్రిష ప్రచార బరిలోకి దిగితే మరికొంత మంది గ్లామర్ హీరోయిన్లు కూడా క్యూ కట్టే అవకాశముందనీ అంచనా వేస్తున్నారు. ఇంకా ఏయే కొత్త పేర్లు ఈ జాతిబాలో చేరుతాయో చూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|