21న వస్తున్న 'మళ్లీ మళ్లీ'
ఒక వ్యక్తి జీవితంలో ఒకరోజు జరిగిన సంఘటనల సమాహారంగా రూపొందుతున్న చిత్రం 'మళ్లీ మళ్లీ'. సంధ్య, కల్యాణి హీరోహీరోయిన్లుగా శ్రీ సహస్య ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై దినేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈనెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న దర్శక నిర్మాతలు తెలియజేశారు.
రాజ్ ఆదిత్య మాట్లాడుతూ, మస్టర్ మిస్టరీ కథాంశంతో అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. ఒక కుర్రాడు ఉద్వాగాన్వేణలో ఉండగా అతని జీవితంలో అనేక మలుపులు సంభవిస్తాయనీ, అవేంటనేవి సినిమాలో చూడాల్సిందేనని అన్నారు. సస్పెన్ తో పాటు మంచి కామిడీ కూడా ఉందనీ, ఈ చిత్రం ద్వారా తమన్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నామనీ చెప్పారు. ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ, 'మఖ్ డీ', 'స్వదేశ్' వంటి చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు మకరంద్ దేశ్ పాండే ఈ చిత్రంలోని 'నిన్నంటేనే సున్ా హళ్లీ, నిన్నొస్తుందా మళ్లీ మళ్లీ ' అనే పాటలో అతిథిగా నటించారని తెలిపారు. శివేంద్ర ఛాయాగ్రహణం కూడా సినిమాకి మరో హైలైట్ అవుతుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సచిన్ ఖేద్కర్, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, కొండవలస, శ్రీనివాసరెడ్డి, మేల్కొటి, మాస్టర్ భరత్, అపూర్వ, గీతాసింగ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రాజ్ ఆదిత్య కథ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|