హాలిడే మూడ్ లో మహేష్
ప్రిన్స్ మహేష్ బాబు ఇంకా హాలిడే మూడ్ నుంచి బయటకు వచ్చినట్టు లేదు. ఆయన సుమారు రెండేళ్ల క్రితం 'అతిథి' చిత్రం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోకపోవడం, గత ఏడాది ఆయన నటించన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 'అతిథి' చిత్రాన్ని 'పోకిరి' వంటి ఆల్ టైమ్ రికార్డ్ హిట్ చిత్రంతో పోల్చి ప్రేక్షకులు చూడటం వల్ల అనుకున్న ఫలితం రాలేదని భావించిన మహేష్ తగినంత రెస్ట్ తీసుకుని కొద్ది గ్యాప్ అనంతరం రెట్టించిన ఉత్సాహంతో సెట్స్ మీదకు రావాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి మహేష్ కమిట్ అయ్యారు. అయితే ఇది జరిగి కూడా ఏడాది దాటింది. గత ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు రావాలని ప్లాన్ చేసినా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్ లో ప్రధాన కథానాయికగా అనుకున్న పార్వతి మిల్టన్ మారిపోయి ఆ ప్లేస్ లో అనుష్క వచ్చింది. పలు అవాంతరాల మధ్య ఈ చిత్రం ఆగిపోయినట్టేననే ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది.
మహేష్ కు 9 కోట్లు, త్రివిక్రమ్ కు 4 కో్ట్లు, అనుష్కకు 1.5 కోట్లు...వెరసి దాదాపు మెయిన్ టీమ్ కే 15 కోట్లు ఖర్చువుతుందదట., దీనికి తోడు నిర్మాత సింగనమల రమేష్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో 'కొమురం భీమ్' చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ పరిణామలతో మహేష్ సినిమా వెనుకబాట పట్టిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటిదేమీ ఉండకపోవచ్చనీ, ఒకసారి షెడ్యూల్ మొదలైతే నాన్ స్టాప్ గా అతి తక్కువ రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయనీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహేష్ సైతం ప్రస్తుతం మలేసియాలో హాలీడేస్ మూడ్ లో ఉన్నందున ఈ నెలాఖరుకు ఆయన తిరిగి రాగానే షూటింగ్ షెడ్యూల్ మొదలవుతుందనీ చెబుతున్నారు. మహేష్ అభిమానులు కోరుకుంటున్నది కూడా ఇదే మరి.
Be first to comment on this News / Article!
|