ముమైత్ 'టార్గెట్' 20న
శివబాలాజీ, ముమైత్ ఖాన్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'టార్గెట్'. సిరి సాయి సూర్యా పతాకంపై రమేష్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 20న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో శనివారంనాడు చిత్రయూనిట్ తెలియజేసింది.
రమేష్ రాజా మాట్లాడుతూ, కథకు అనుగుణమైన విభిన్నమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని తీశామనీ, బెంగుళూరు దగ్గర తీసిన ఒక ఎపిసోడ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ చెప్పారు. హీరోహీరోయిన్లు పాత్రపరంగా వేసే ఎత్తుకు పైఎత్తులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయనీ, కృష్ణారెడ్డి నృత్య రీతులు సమకూర్చిన సల్సా డాన్స్ లో హీరోహీరోయిన్లు ముగ్గురు నటించారనీ చెప్పారు. అలాగే
ఈ చిత్రానికి రీరికార్డింగ్ ప్రధాన ఆకర్షణ అవుతుందని పేర్కొన్నారు. మాస్, క్లాస్ తో సహా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన సంగిశెట్టి దశరథ తెలిపారు. త్వరలో ఆడియో, ఈనెల 20న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. శివబాలాజీ మాట్లాడుతూ, సినిమాలోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వచ్చిందనీ, సాంకేతికపరంగా కూడా మంచి చిత్రమవుతుందనీ చెప్పారు. ఆర్.కె.ఫిలింస్ ద్వారా ఈ చిత్రాన్ని రాష్ట్రమంతటా విడుదల చేస్తున్నట్టు చిత్ర సమర్పకుడు ఆర్.కె.గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో మరో నిర్మాత బి.రామకృష్ణ, సహ నిర్మాత ాకుల రమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణ భగవాన్, రియాజ్ ఖాన్, జీవా, సైరాభాను, విశ్వజిత్ ప్రదాన్, వేణుమాధవ్, గీతాసింగ్ తదితరులు నటించారు. వెలిగొండ శ్రీనివాస్ మాటలు, వి.ఎస్.సురేష్ కుమార్ సినిమాటోగ్రఫీ, కె.రమేష్ ఎడిటింగ్, విజయ్ ఫైట్స్, కోటి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|