రాజా 'సొంతవూరు' 21న
'ఆనంద్', 'వెన్నెల' చిత్రాల కథానాయకుడు రాజా, తీర్థ (నూతన పరిచయం) జంటగా శ్యావ్య ఫిలింస్ పతాకంపై వై.కిషోర్ బాబు, బసిరెడ్డి నిర్మించిన చిత్రం 'సొంతవూరు'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈనెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, కందుకూరులోని చక్కటి పల్లెవాతావారణంలో షూటింగ్ జరిపామనీ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరినీ తన వాళ్లుగా భావిస్తూ అందరికీ నోట్లో నాలుకలా ఉంటే అమాయకత్వం మూర్తీభవించిన పాత్రలో రాజా చక్కటి నటన ప్రదర్శించినట్టు చెప్పారు. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్ కలగలసిన పాత్రలో ఎల్.బి.శ్రీరామ్, ఊరి పెద్దగా తనికెళ్ల భరణి, జీవా, ఎం.ఎస్.నారాయణ, విజయ్ చందర్ ఇతర పాత్రల్లో చక్కగా నటించారనీ తెలిపారు. అలాగే పుణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన ముంబై అమ్మాయి తీర్థ, స్వాతి కూడా మంచి నటన కనబరచారని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రాళ్లపల్లి, వీరేంద్ర చౌహాన్, రాజు శ్రీవాత్సవ్, స్వాతి, ఆర్తిపూరి, మాస్టర్ అశోక్, బేబి నాగరాణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎల్.బి.శ్రీరామ్ మాటలు, సాయిజేమ్ సినిమాటోగ్రఫీ, సాకేత్ సాయిరాం సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|