27న థియేటర్లన్నీ'హౌస్ ఫుల్'
విపిన్, వేగ, ఆర్యన్, గౌరీ పండిట్ ప్రధాన పాత్రల్లో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్రసిద్దార్ధ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'హౌస్ ఫుల్'. అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న ఉగాది కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు భుయాన్ మాట్లాడుతూ, రెండు గంటల కథతో ముగిసే సినిమా ఇదనీ, స్క్రీన్ ప్లే లో కొత్త ప్రయోగం ఈ చిత్రమనీ చెప్పారు. ఇద్దరమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలతో పాటు ఆలీ కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. నిర్మాత చంద్రసిద్దార్ధ మాట్లాడుతూ, టైటిల్ ను బట్టి ఇది సినిమా నేపథ్యంలో ఉంటుందని అనుకోరాదనీ, చక్కిటి రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా సినిమా తెరకెక్కిందనీ చెప్పారు. ఇందులో గొట్టముక్కల కొండలరావుగా విపిన్, కాడికొండ సుబ్రమణ్య శాస్త్రిగా ఆర్యన్, లంపకలోన శాంతిప్రయగా వేగ నటించారనీ తెలిపారు. అనూప్ సంగీత సారధ్యంలో రూపొందింన పాటలకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నైనీ, దీక్షిత్, ధర్మవరపు, ఆర్.కె., అంబటి శ్రీను, టార్జాన్, సత్తన్న, దాసన్న తదితరులు నటించారు. ఈ చిత్రానికి వి.ఎస్.జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, శ్రావణ్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|