శివాజీ 'డైరీ' 27న
ఉగాది చిత్రాల పోటీలో హీరో శివాజీ కూడా వచ్చి చేశారు. ఆయన కథానాయకుడుగా 'మంత్ర' చిత్రానికి కొనసాగింపుగా రూపొందింన చిత్రం 'డైరీ'. శ్రద్దాదాస్, సజిత హీరోయిన్లు. జెన్ నెక్ట్స్ మూవీస్ సంస్థ గ్రేట్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సోమావిజయప్రకాష్ నిర్మాణ సారథ్యంలో కల్యాణ్ రామ్ చుక్కా, మేఘశ్యామ్ బోకం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మచ్చకంటి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాతాంతర కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ జరుపుకొంటోంది. ఈనెల 27న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కల్యాణ్ రామ్ చుక్కా తెలిపారు.
ఒక డైరీ వల్ల ఈ చిత్రంలోని పాత్రలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయనేదే ఇతివృత్తంగా ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రం రూపొందినట్టు ఆయన తెలిపారు. 'మంత్ర' చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తీస్కున్నప్పటికీ, మరో కొత్త కోణంలో వినోదాన్ని మేళివించి ఉంటుందని చెప్పారు. ఇందులో శివాజీ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందనీ, అలెప్పి, వైజాగ్ పరిసరాల్లోకి షూటింగ్ జరిపామనీ చెప్పారు. ఉగాది కానుకగా సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అందరి సహకారంలో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగామని దర్శకుడు రామకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో డాక్టర్ శివప్రసాద్, జీవా, హర్షవర్దన్, శ్రీనివాస్, కమల్ తదితరులు నటించారు. అరుణ్ రచన, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, మంత్ర ఆనంద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|