ఉగాదికి 'ఆనందతాండవం'
'హ్యాపీడేస్ ', 'కాళిదాసు'. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాలతో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న తమన్నా ప్రధాన హీరోయిన్ గా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై అగ్ర నిర్మాత వి.రవిచంద్రన్ నిర్మించిన ద్విభాషా చిత్రం 'ఆనంద తాండవం'. ఎ.ఆర్.గాంధీకృష్ణ దర్శకుడు. ఎస్.వి.ఆర్.మీడియో పతాకంపై శోభారాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డి.సురేష్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుందనీ, సోనీ బిఎంజి ద్వారా ఆడియో, 27న ఉగాది కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు శోభారాణి తెలిపారు.
ఆస్కార్ బ్యానర్ నుంచి గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయనీ, వాటిని తెలుగులో విడుదల చేసి వరుస హిట్లు సాంధించిన క్రెడిట్ ఎస్.వి.ఆర్.మీడియాకు దక్కుతుందనీ ఆమె తెలిపారు. ఆస్కార్ గత చిత్రాల తరహాలోనే 'ఆనందతాండవం' చిత్రం సైతం ఎంతో రిచ్ గా రూపొందిందనీ, పెద్ద సక్సెస్ ను సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ ఉందనీ చెప్పారు. ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, మరికొద్ది రోజుల్లోనే సోనీ బిఎంజి ద్వారా ఆడియో, ఉగాది కానుకగా సినిమా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తమన్నాతో పాటు సిద్దార్ధ (నూతన పరిచయం), రుక్మిణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సుజాత కథ, శశాంక్ వెన్నెలకంటి మాటలు, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, వనమాలి పాటలు, పద్మశ్రీ తోటతరణి కళాదర్శకత్వం, జీవాశంకర్ సినిమాటోగ్రఫీ, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|