క్రేజీ స్టార్ తో ప్రియమణి
నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ద్రోణ' చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా మంచి ఓపినింగ్స్ ను రాబట్టడం వెనుక ప్రియమణి అందంచందాలు ప్రధాన కారణమయ్యాయి. ఒక పాట అంతా బికినీలో కనిపించడం, వర్షం సాంగ్ తో యూత్ అడియెన్స్ ను థియేటర్ల వైపు నడిపించింది. ఆసక్తికరంగా ప్రియమణి ప్రస్తుతం బాలకృష్ణతో నటిస్తున్న 'మిత్రుడు' చిత్రంలోనూ ఓ వర్షం సాంగ్ చిత్రీకరణ జరిగినట్టు పబ్లిసిటీ స్టిల్స్ చూస్తే తెలుస్తుంది. ప్రియమణి నటించిన ఓ రెండు తమిళ చిత్రాలు సమ్మర్ కు విడుదలవుతుండగా, మణిరత్నం హిందీ, తమిళ వెర్షన్లలో రూపొందిస్తున్న 'రావణ'లోనూ, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ సరసన 'రామ్' (తెలుగు 'రెడీ' రీమేక్) లోనూ ఆమె నటిస్తోంది. తాజాగా మరో తెలుగు చిత్రానికి కూడా ప్రియమణి కమిట్ అయింది. ఇందులో క్రేజీ స్టార్ రవితేజకు జోడిగా ప్రియమణి నటించనుంది.
రవితేజకు 'కృష్ణ' సక్సెస్ తర్వాత మళ్లీ సరైన బ్రేక్ దొరకలేదు. 'బలాదూర్', 'నేనింతే' చిత్రాలు బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'కిక్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆదిత్యారామ్ నిర్మాతగా పరశురామ్ దర్శకత్వంలో
ఓ చిత్రానికి రవితేజ కమిట్ అయ్యాయి. ఈ చిత్రంలోనే కథానాయికగా ప్రియమణి నటించబోతోంది. ప్రియమణి గ్లామర్ అట్రాక్షన్ రవితేజకు 'విక్రమార్కుడు' తరహా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|